Homeటాప్ స్టోరీస్ట్రైల‌ర్ టాక్ : ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి మ్యాచ్ అయ్యేలానే వుంది!

ట్రైల‌ర్ టాక్ : ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి మ్యాచ్ అయ్యేలానే వుంది!

Nani V trailer talk - maches the expectations
Nani V trailer talk – maches the expectations

నేచుర‌ల్ స్టార్ నాని తొలి సారి విల‌న్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `వి`.  ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో హీరోగా సుధీర్‌బాబు న‌టించారు. శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు 200 దేశాల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

ఈ చిత్ర అఫీషియ‌ల్ ట్రైల‌ర్‌ని బుధ‌వారం రిలీజ్ చేశారు. నాని నెగెటివ్ షేడ్స్ వున్న సైకో కిల్ల‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. నానిని వెంటాడే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు క‌నిపించ‌బోతున్నారు. ఇందులో హీరోయిన్‌లుగా ఆదితిరావు హైద‌రీ, నివేదా థామ‌స్ న‌టిస్తున్నారు. `హ‌లో హ‌లో హాలో మైక్ టెస్టింగ్  వ‌న్ టు త్రీ.. ఏ ప‌ని చేసినా స‌రే ఎంట‌ర్‌టైనింగ్ చేయాల‌ని నా పాల‌సీ. .. ఇది సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ వేరే వుంది…లెట్స్ ద ఫ‌న్ బిగిన్‌.. వైలెన్స్ సినిమాలంటే ఇష్ట‌మా మీకు.. అంటూ నాని చెప్పే డైలాగ్‌లు, రోమాంచితంగా సాగే యాక్ష‌న్ స‌న్న‌వేశాలు సినిమా ఓ రేంజ్‌లో వుంటుంద‌ని స్ప‌ష్టం చేస్తోంది.

- Advertisement -

చివ‌ర‌గా `మ‌ళ్లీ ఎక్క‌పెక్టేష‌న్‌కి మ్యాచ్ అవ్వ‌లేద‌న్న మాట రాకూడ‌దు` అంటూ నాని ఇచ్చే పంచ్ సినిమా ప‌ర్‌ఫెక్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అని ఖాయంగా చెప్పిన‌ట్టుగా వుంది. ఓవ‌రాల్‌గా ప్ర‌తీ కారం కోసం వ‌రుస హ‌త్య‌లు చేసే యువ‌కుడిగా నాని, అత‌న్ని ఆప‌డానికి ప్ర‌య‌త్నించే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ల ఛాలెంజింగ్‌ గేమ్ నేప‌థ్యంలో ఆద్యంత మెరుపులు, మెస్మ‌రైజింగ్ స‌న్నివేశాల‌తో `వి` విక్ట‌రీని సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ అదిరిపోయింది. పిక్చ‌ర్ ఇంకా అదిరిపోవ‌డం ఖాయం అన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. నాని న‌టిస్తున్న 25వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న `వి` నాని ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డం ఖాయం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All