Homeటాప్ స్టోరీస్సేఫ్ గా ఉండటానికి వ్యాక్సిన్ ఒకటే మార్గమంటోన్న నాని

సేఫ్ గా ఉండటానికి వ్యాక్సిన్ ఒకటే మార్గమంటోన్న నాని

nani urges fan to get vaccinated to stay safe
nani urges fan to get vaccinated to stay safe

న్యాచురల్ స్టార్ నాని సినిమాల పరంగా ఫుల్ బిజీగా మారనున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్స్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు తిరిగి షూటింగ్స్ కు అనుమతులు వచ్చాయి. నాని తిరిగి షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

“మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుని సేఫ్ గా ఉండడమా? లేక సేఫ్ గా ఉండటానికి వ్యాక్సిన్ వేయించుకోవడమా? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి” అని పిలుపునిచ్చాడు. అంటే సేఫ్ గా ఉండటానికి వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని నాని చెప్పకనే చెబుతున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం టక్ జగదీష్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న నాని, శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత అంటే సుందరానికి చిత్రం కూడా లైన్లో ఉంది. ఈ ఏడాది ఒకటి లేదా రెండు చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All