Homeటాప్ స్టోరీస్నాని హిట్ సినిమా తమిళ్ లో

నాని హిట్ సినిమా తమిళ్ లో

nani ninnu kori movie will be remade in kollywoodనాని హీరోగా నటించిన ” నిన్ను కోరి ” చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకుముందు ఎక్కువగా తమిళ చిత్రాలను మన తెలుగువాళ్ళు రీమేక్ చేస్తూండేవాళ్లు కానీ కాలక్రమంలో తెలుగు నుండి తమిళ్ కు రీమేక్ అవుతున్నాయి . ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది , ఎన్టీఆర్ నటించిన టెంపర్ , నాన్నకు ప్రేమతో చిత్రాలు తమిళ్ లో రీమేక్ అవుతున్నాయి కాగా అదే వరసలో ఇప్పుడు నాని సినిమా చేరింది . నాని – నివేదా థామస్ జంటగా నటించిన నిన్ను కోరి చిత్రం గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని సాధించింది కాగా ఇప్పుడా చిత్రం తమిళ్ లో రీమేక్ కానుంది .

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్ను కోరి చిత్రం పై విమర్శలు వచ్చినప్పటికీ మొత్తానికి విజయమే కావాల్సింది కాబట్టి విజయవంతమైన నిన్ను కోరి చిత్రాన్ని తమిళ్ వాళ్ళు రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపించారు . నాని తెలుగులోనే కాకుండా తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ! అయితే నాని పాత్రలో మాత్రం తమిళ్ లో వైభవ్ నటించనున్నట్లు తెలుస్తోంది . తెలుగునాట విజయం సాధించిన నిన్ను కోరి తమిళ్లో విజయం సాధిస్తుందా ? లేదా ? చూడాలి .

- Advertisement -

English Title: nani ninnu kori movie will be remade in kollywood

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All