Homeటాప్ స్టోరీస్కన్నీళ్లు పెట్టుకున్న నాని

కన్నీళ్లు పెట్టుకున్న నాని

Hero nani prayers for kerala peoplesహీరో నాని కన్నీళ్ల పర్యంతమయ్యాడు , ఏడ్చేంత కష్టం నానికి ఏమొచ్చింది అనే కదా …… మీ డౌట్ ! తన సినిమాకు పనిచేస్తున్న కెమెరామన్ కేరళ వాసి , కేరళలో గతకొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది . వరదలతో భారీ ఆస్థి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా సంభవించింది . ఇక ఆ వరదల్లో దేవదాస్ కెమెరామన్ శాందత్ కుటుంబం చిక్కుకుంది వాళ్లకు సరైన తిండి లేక , మంచి నీళ్లు లేక వరదలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట ! వాళ్ళ కష్టాలు శాందత్ కు చెబుతుంటే అవి తట్టుకోలేక శాందత్ లొకేషన్ లో ఏడుస్తూ కుర్చున్నాడట !

కెమెరామెన్ ఏడుస్తుంటే దేవదాస్ లొకేషన్ లో ఉన్నవాళ్లు కూడా తట్టుకోలేక పోయారట ! అలాగే వాళ్లతో పాటుగా హీరో నాని కూడా శాందత్ కుటుంబ సభ్యుల రోదనలు కన్నీళ్ల పర్యంతం అయ్యాడట ! అంతేకాదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేరళ లోని ప్రజలకు సహాయం చేయాలనీ ట్విట్టర్ సాక్షిగా కోరుతున్నాడు నాని . తాజాగా అక్కినేని నాగార్జున తో కలిసి నాని దేవదాస్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది . దాంతో తనవాళ్ల పరిస్థితి కి తట్టుకోలేక పోయాడు ఛాయాగ్రాహకుడు శాందత్ .

- Advertisement -

English Title: Hero nani prayers for kerala peoples

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All