Homeటాప్ స్టోరీస్పూరి తో సినిమా చేసేది లేదన్న నాని

పూరి తో సినిమా చేసేది లేదన్న నాని

nani gives shock puri jagannadhవరుసగా ఘోర పరాజయాలు చవిచూస్తున్న దర్శకులు పూరి జగన్నాధ్ తో సినిమా చేయడం లేదని అంటున్నాడు హీరో నాని . తాజాగా నాని బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఒకవైపు బిగ్ బాస్ షో చేస్తూనే మరోవైపు సీనియర్ హీరో నాగార్జున తో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు నాని . అయితే పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు రావడం తో అవన్నీ గాలి వార్తలే అని పూరి తో సినిమా చేయడం లేదని తేల్చి పడేసాడు నాని .

పూరి జగన్నాధ్ కు గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతున్నాయి . దాంతో తనయుడు పూరి ఆకాష్ తో మెహబూబా చిత్రం చేసాడు కానీ అది కూడా ప్లాప్ అయ్యింది . వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ పూరి జగన్నాధ్ తన కథల విషయంలో మాత్రం అస్సలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు . ఒకప్పుడు పూరి తో సినిమా చేయాలనీ హీరోలు తహతహలాడేవాళ్లు కానీ ఇప్పుడేమో పూరి హీరోల వెంట పడుతున్నప్పటికీ ఒక్క హీరో కూడా కనికరించడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All