Homeటాప్ స్టోరీస్నాని నాల్గవ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు

నాని నాల్గవ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు

నాని నాల్గవ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు
నాని నాల్గవ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాక నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అ!, హిట్ చిత్రాలను నిర్మించాడు నాని. హిట్ 2 ను మూడో సినిమాగా అనౌన్స్ చేసాడు. ఇప్పుడు తన బ్యానర్ లో నాల్గవ చిత్రం లాంచ్ అయింది. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అనే ఆసక్తికర టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.

ఈ చిత్రాన్ని నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఆమెకిదే తొలి చిత్రం. ఈ సినిమా ఒక ఆసక్తికర అంశం చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. ఐదుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో భాగం కానున్నారని సమాచారం. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు కన్ఫర్మ్ చేసారు. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపిస్తాడు.

- Advertisement -

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇక నాని హీరోగా టక్ జగదీష్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాల్లో నటిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All