Homeటాప్ స్టోరీస్నందిని రెడ్డికి హీరో దొరికేసాడు!!

నందిని రెడ్డికి హీరో దొరికేసాడు!!

నందిని రెడ్డికి హీరో దొరికేసాడు!!
నందిని రెడ్డికి హీరో దొరికేసాడు!!

మహిళా దర్శకురాలు నందిని రెడ్డి లాస్ట్ సినిమా ఓ బేబీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ నందిని తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు. మధ్యలో ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసింది. ఇక నందిని రెడ్డి తన తర్వాతి ప్రాజెక్టుకు ఆల్రెడీ వైజయంతి వారితో కమిటైన విషయం తెల్సిందే. కాకపోతే యువ హీరోలు ఎవరూ ఖాళీ లేకపోవడంతో నందిని వెయిటింగ్ ఇంకొన్నాళ్ళు కొనసాగింది.

తాజా సమాచారం ప్రకారం మొత్తానికి నందిని రెడ్డికి హీరో దొరికేసాడు. సంతోష్ శోభన్ తో నందిని ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను డైరెక్ట్ చేయనుంది. ఇటీవలే విడుదలైన ఏక్ మినీ కథ చిత్రం ద్వారా సంతోష్ శోభన్ అందరినీ మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. సంతోష్ శోభన్ కు కూడా ప్రశంసలు దక్కాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో నందిని రెడ్డి సినిమా సంతోష్ కు దక్కడం తనకు అదృష్టమని చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా ద్వారా తన రేంజ్ ను సంతోష్ మరింత పెంచుకుంటాడేమో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All