Homeటాప్ స్టోరీస్మినీ రివ్యూ: ఏక్ మినీ కథ

మినీ రివ్యూ: ఏక్ మినీ కథ

మినీ రివ్యూ: ఏక్ మినీ కథ
మినీ రివ్యూ: ఏక్ మినీ కథ

సంతోష్ (సంతోష్ శోభన్)కు చిన్నతనం నుండి తన అంగం చిన్నది అనే ఆత్మన్యూనతా భావం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండి ఆ భయాలతోనే పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ ఆలోచనల వల్ల తను అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటాడు. ఆ ఒక్క కారణంతోనే పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల నేపథ్యంలో అతని పెళ్లి కూడాజరిగిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ ఏం చేసాడు? ఎలా తన సమస్యను అధిగమించాడు?

కథ ప్రకారం వినగానే చాలా బోల్డ్ గా అనిపించే ఏక్ మినీ కథను వీలైనంత పద్దతిగా చెప్పడానికే ప్రయత్నించారు. మేర్లపాక గాంధీ మంచి పాయింట్ ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి. ఏ కంప్లైంట్ లేకుండా ఇంటర్వెల్ వరకూ వెళ్ళిపోతుంది సినిమా. అయితే సెకండ్ హాఫ్ కథనంతో ఈ సినిమా బాగా ఇబ్బంది పడింది. ఒకే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథా, కథనాలు చిరాకు పెడతాయి.

- Advertisement -

అయితే మొత్తానికి ఏక్ మినీ కథ మళ్ళీ సాఫ్ట్ గా ఎండ్ అయి సంతృప్తి పరుస్తుంది. సంతోష్ శోభన్ నటన పరంగా ఆకట్టుకున్నాడు. సుదర్శన్ కామెడీ గిలిగింతలు పెడుతుంది. సాంకేతిక వర్గం పనితీరు కూడా బాగుంది. సెకండ్ హాఫ్ మీద ఇంకొంత దృష్టి పెట్టి ఉన్నట్లయితే ఏక్ మినీ కథ ట్రెండ్ సెట్టర్ అయ్యుండేది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All