Homeగాసిప్స్బాలయ్య సరసన ఎఫ్3 భామ?

బాలయ్య సరసన ఎఫ్3 భామ?

బాలయ్య సరసన ఎఫ్3 భామ?
బాలయ్య సరసన ఎఫ్3 భామ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో తిరిగి మొదలుకానుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉంటే అఖండ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రకు ఎంపికైన విషయం తెల్సిందే.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎఫ్3 భామ మెహ్రీన్ నటిస్తోందని తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది మెహ్రీన్ పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెబుదామని నిర్ణయించుకుంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె పెళ్లి వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అందుకే మెహ్రీన్ మళ్ళీ సినిమాలను ఒప్పుకుంటోంది. ఎఫ్3 పూర్తవ్వగానే బాలయ్య 107 చిత్రానికి డేట్స్ ఇవ్వనుంది. మరో హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All