Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్వైర‌ల్ అవుతున్న మెహ్రీన్  ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్!

వైర‌ల్ అవుతున్న మెహ్రీన్  ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్!

Mehareen Pre wedding photo shoot gors viral
Mehareen Pre wedding photo shoot gors viral

నటి మెహ్రీన్ పిర్జాడా తన ప్రియుడు భావ్య బిష్ణోయితో కొద్ది రోజుల క్రితం జైపూర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. భ‌వ్య బిష్ణోయ్ యు రాజకీయ నాయకుడు. అంతే కాకుండా హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రికి స్వ‌యానా మ‌న‌వ‌డు కావ‌డంతో వీరి వివాహం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. తాజాగా మెహ్రీన్ ఒక అందమైన ఫొటోని పంచుకుంది.

- Advertisement -

ఫొటోలో మెహ్రీన్, భ‌వ్య‌ బిష్ణోయ్ క‌లిసి చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నారు. `హలో భాగస్వామి` అని మెహ్రీన్ ఈ ఫొటోకి శీర్షిక పెట్టింది. నెటిజన్లు ఈ జంటపై ప్రేమ కురిపిస్తున్నారు. ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు వారిని అభినందిస్తున్నారు.

మెహ్రీన్ 2015 లో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ త‌రువాత మహనుభవుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, అశ్వద్ధామ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `ఎఫ్ 3` లో నటిస్తోంది. ఇది `ఎఫ్ 2` కి సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 27 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts