Homeన్యూస్బాలయ్య పారితోషికం వింటే ఆహా అనాల్సిందే!

బాలయ్య పారితోషికం వింటే ఆహా అనాల్సిందే!

బాలయ్య పారితోషికం వింటే ఆహా అనాల్సిందే!
బాలయ్య పారితోషికం వింటే ఆహా అనాల్సిందే!

నందమూరి బాలకృష్ణ తొలిసారి పెద్ద తెర నుండి ఓటిటి ప్లాట్ ఫామ్ కు జంప్ చేస్తోన్న విషయం తెల్సిందే. తెలుగువారి ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నాడు. అన్ స్టాపబుల్ పేరుతో రూపొందుతోన్న ఈ టాక్ షో చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ తరహాలో చేయడం బాలకృష్ణకు ఇదే తొలిసారి. ఇక ఈ షో ను ఇటీవలే లాంచ్ కూడా చేసారు. దీపావళి సందర్భంగా మొదటి ఎపిసోడ్ నవంబర్ 4న విడుదల కానుంది.

అన్ స్టాపబుల్ ను మొత్తంగా 12 ఎపిసోడ్స్ గా చిత్రీకరించాలని ప్లాన్ చేసారు. మొత్తంగా 12 ఎపిసోడ్స్ కు గాను బాలకృష్ణకు దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికాన్ని ముట్టచెబుతున్నాడట అల్లు అరవింద్. ఇది దాదాపుగా బాలయ్య ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్. బాలకృష్ణ ఎప్పుడూ కూడా సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోలేదు. సినిమా బడ్జెట్ ను బట్టి కావాలంటే ఇంకా తగ్గించుకుని నిర్మాతలకు అందుబాటులో ఉంటూ వచ్చాడు.

- Advertisement -

అయితే అల్లు అరవింద్ బాలయ్య డిమాండ్ చేయకుండానే ప్రతీ ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున పేమెంట్ ను మాట్లాడుకుని ఫిక్స్ చేసాడట. బాలకృష్ణ వంటి స్టార్ హీరో నిర్వహిస్తోన్న షో కావడంతో దీనిపై అంచనాలు అయితే బాగున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All