Homeటాప్ స్టోరీస్బాలయ్య ఫస్ట్ రోర్.. అదిరిపోయిందిగా

బాలయ్య ఫస్ట్ రోర్.. అదిరిపోయిందిగా

బాలయ్య ఫస్ట్ రోర్.. అదిరిపోయిందిగా
బాలయ్య ఫస్ట్ రోర్.. అదిరిపోయిందిగా

నందమూరి బాలకృష్ణను ఎలా వాడుకోవాలో బోయపాటికి తెలిసినంతగా ఈతరం మిగతా దర్శకులకు తెలీదేమో. గతంలో సింహా, లెజండ్ తో రెండు సార్లు  బ్లాక్ బస్టర్లు సాధించిన ఇద్దరూ, ఇప్పుడు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం టీమ్ సిద్ధమవుతుండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడిన విషయం తెల్సిందే.

అయితే తొలి షెడ్యూల్ లో కేవలం ఫైట్ సీన్ ఒక్కటే చిత్రీకరించామని ఇటీవలే తెలిపారు బాలకృష్ణ. ఇప్పుడు ఈ ఫైట్ సీన్ నుండే చిన్న టీజర్ బిట్ ను రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు చిత్ర యూనిట్. బోయపాటి మార్క్ షాట్స్, బాలయ్య మాస్ అప్పీల్, రోమాలు నిక్కబొడిచే డైలాగ్ తో ఈ టీజర్ అభిమానులకు కనువిందుగా ఉంది. ఈ టీజర్ చూసిన ఎవరైనా బాలయ్యను బోయపాటి ప్రోజెక్ట్ చేసినట్లుగా ఇంకెవరూ చేయలేరేమో అనుకోవచ్చు.

- Advertisement -

“ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లంబ్డి కొడకా” అని బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానుల చేత విజిల్స్ వేయించడం ఖాయం. ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దీనికి సహకరించిందనే చెప్పాలి. వీలైనంత త్వరగా షూటింగ్ ను మొదలుపెట్టి ఈ దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి అది ఎంత వరకూ సాధ్యపడుతుందో.

YouTube video

Credit: Youtube

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All