Homeటాప్ స్టోరీస్మహేష్ బ్రేక్ విషయంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత

మహేష్ బ్రేక్ విషయంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత

namrata clarifies on mahesh three month long break
namrata clarifies on mahesh three month long break

సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు మూడేళ్ళ నుండి పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమాను ప్రకటించి, ఆ చిత్రం పూర్తవ్వగానే కొన్ని రోజుల గ్యాప్ లోనే దీన్ని మొదలుపెట్టి సినిమాలు పూర్తి చేస్తూ వచ్చాడు. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ వస్తే ఫ్యామిలీతో టూర్స్ కు వెళ్లే మహేష్, సినిమా పూర్తయ్యాక మాత్రం ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోలేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెల్సిందే. నవంబర్ చివరికి ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ కేరళలో షూటింగ్ చేస్తోంది. ఇదే ఈ చిత్రానికి చివరి షెడ్యూల్. దీని తర్వాత కొంత ప్యాచ్ వర్క్ ఉంది. డిసెంబర్ నుండి ప్రమోషన్స్ మొదలుపెడతారు. ఇక సంక్రాంతికి జనవరి 12న సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ కానుంది. ఎప్పుడూ ప్రస్తుత సినిమా పూర్తవుతుండగానే మరో సినిమాను ప్రకటించే మహేష్ ఈసారి తన 27వ సినిమా ఎవరితో అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీనికి పలు రకాల కారణాలు చెప్పారు విశ్లేషకులు.

ఒకటి మహేష్ టచ్ లో దర్శకులెవరూ జనవరి కల్లా పూర్తి స్క్రిప్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, సందీప్ వంగ ఇలా అందరూ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. సందీప్ వంగ అయితే మహేష్ నుండి ఎంతకీ పిలుపు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసాడు. అక్కడ టాప్ హీరోతో క్రైమ్ థ్రిల్లర్ ను తీయబోతున్నాడు. వంశీ పైడిపల్లి సాధారణంగానే స్క్రిప్ట్ ను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. మహేష్ చెప్పిన టైమ్ కు స్క్రిప్ట్ అందివ్వలేడు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ టైమ్ లోనే మరో లైన్ వినిపించినా దానికి ఇంకా సమయం పడుతుంది. అందుకే మహేష్ సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో వాదన ఏంటంటే, మహేష్ కు ఇలా గ్యాప్ తీసుకోవడం కొత్తేమి కాదు.

- Advertisement -

అతిథి తర్వాత దాదాపు ఖలేజా చేయడానికి రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మొదట మూడు నెలలు గ్యాప్ అనే అనుకున్నా అది క్రమంగా రెండేళ్లకు పెరిగిపోయింది. మహేష్ ప్రస్తుతం సినిమాల పరంగా రొటీన్ అవుతున్నాడన్న ఫీలింగ్ అభిమానులకు కూడా కలుగుతోంది. స్క్రిప్ట్స్ విషయంలో తనని తాను సరిదిద్దుకోవడానికి, ఎలాంటి సినిమాలు చేయాలో పునరాలోచించుకోవడానికి మహేష్ ఈ గ్యాప్ ను వాడుకుంటాడట. అయితే ఈ వార్త చాలా కాలం క్రితమే వచ్చినా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో నిజమో కాదో అని సందేహించారు.

అయితే నమ్రత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. మహేష్ బ్రేక్ తీసుకుంటున్న విషయం నిజమేనని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి, ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయాల కోసం ఈ బ్రేక్ ఉపయోగపడుతుందని నమ్రత పేర్కొంది. మూడు నెలలు బ్రేక్ అంటే వచ్చే ఏప్రిల్ దాకా మహేష్ నుండి మరో ప్రకటన రాదన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All