Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు సినిమా అక్కడ డిజాస్టర్

మహేష్ బాబు సినిమా అక్కడ డిజాస్టర్

మహేష్ బాబు సినిమా అక్కడ డిజాస్టర్
మహేష్ బాబు సినిమా అక్కడ డిజాస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ మహర్షి హిట్ టాక్ ను తెచ్చుకుని దాన్ని సస్టైన్ చేస్తూ 100 కోట్ల కలెక్షన్ ను అందుకుంది. ఒకట్రెండు ఏరియాల్లో తప్పిస్తే మిగతా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దాటి మహర్షి బయ్యర్లకు లాభాలు తీసుకువచ్చింది. ఇక డిజిటల్ పార్టనర్ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టింది.

సినిమా విడుదలైన కొద్ది రోజులకే ప్రైమ్ లో దర్శనమిచ్చిన మహర్షి అక్కడ కూడా బాగానే వర్కౌట్ అయింది. ప్రైమ్ వాళ్ళు ఈ చిత్రంపై లాభాలు గడించినట్లు సమాచారం. అయితే భారీ డిమాండ్ మధ్య ఈ చిత్ర సాటిలైట్ హక్కులు జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ మధ్య చిత్ర ప్రీమియర్ అవ్వగా షాక్ నిచ్చే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

- Advertisement -

సాధారణంగా పెద్ద చిత్రాలకు 20 టీఆర్పీ వస్తుంది. అయితే ప్రైమ్ లో అప్పటికే ఉండడంతో ఎంత లేదన్నా 15 టీఆర్పీ వస్తుందని ఆశించారు టీవీ యాజమాన్యం. కానీ వారిని షాక్ కు గురి చేస్తూ 9 టీఆర్పీ మాత్రమే సాధించింది. ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ కే ఇంత తక్కువ వచ్చిందంటే ఇక తర్వాత్తర్వాత బుల్లితెరపై మహర్షి పరిస్థితి ఏంటో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All