Homeటాప్ స్టోరీస్షూటింగ్ కి రెడీ అంటున్న గాయపడిన హీరో

షూటింగ్ కి రెడీ అంటున్న గాయపడిన హీరో

Nagasourya
Nagasourya

యంగ్ హీరో నాగశౌర్య కాలికి గాయం అయిన విషయం తెలిసిందే . దాంతో రెస్ట్ తీసుకుంటున్నాడు . అయితే ఇంట్లో రెస్ట్ తీసుకోవడం అంటే ఓ నరకం కాబట్టి త్వరగా కోలుకొని షూటింగ్ కి రెడీ అయిపోవాలని తహతహలాడుతున్నాడు . వైజాగ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో పరుగెత్తుకుంటూ దూకే సన్నివేశంలో నటించాడు నాగశౌర్య , అయితే జంప్ చేసే సమయంలో అదుపుతప్పడం వల్ల కాలికి గాయం అయ్యింది .

దాంతో షూటింగ్ పేకప్ చెప్పారు . నాగశౌర్య ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ కు తరలించారు . ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నాగశౌర్య కు ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెల్దామా ? అని అనిపిస్తోందట . ఎందుకంటే ఎప్పుడూ పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఉండిపోతే బోర్ కొడుతోంది అందుకే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All