Homeటాప్ స్టోరీస్హీరో నాగశౌర్య కు గాయాలు

హీరో నాగశౌర్య కు గాయాలు

Nagashourya injured in shooting
Nagashourya injured in shooting

 

హీరో నాగశౌర్య కు తీవ్ర గాయాలయ్యాయి . తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం కోసం వైజాగ్ వెళ్ళాడు . అక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడ్డాడు దాంతో నాగశౌర్య కాలుకి తీవ్ర గాయమైంది . ఎడమ కాలు ఫ్రాక్చర్ కావడంతో షాక్ అయిన చిత్ర బృందం వెంటనే ఆసుపత్రికి తరలించారు . నాగశౌర్య కాలు దెబ్బతినడంతో దానికి కట్టు కట్టి 25 రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చారట డాక్టర్లు .

- Advertisement -

కాలి గాయం కావడంతో నెల రోజుల నుండి మూడు నెలల వరకు విశ్రాంతి తప్పకపోవచ్చు . పోరాట దృశ్యాల్లో డూప్ లేకుండా , రోప్స్ సహాయం లేకుండా చేయడంతో నాగశౌర్య కు ఈ పరిస్థితి వచ్చింది . మొత్తానికి సక్సెస్ కోసం కష్టపడుతూ కాలు విరగ్గొట్టుకున్నాడు ఈ హీరో . నాగశౌర్య కు గాయాలు కావడంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All