Homeగాసిప్స్నాగార్జున తన నెక్స్ట్ సినిమాలో కొత్తమ్మాయితో రొమాన్స్ చేయనున్నాడా?

నాగార్జున తన నెక్స్ట్ సినిమాలో కొత్తమ్మాయితో రొమాన్స్ చేయనున్నాడా?

నాగార్జున తన నెక్స్ట్ సినిమాలో కొత్తమ్మాయితో రొమాన్స్ చేయనున్నాడా?
నాగార్జున తన నెక్స్ట్ సినిమాలో కొత్తమ్మాయితో రొమాన్స్ చేయనున్నాడా?

అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్ ను గతేడాదే పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే నాగ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పటినుండో వార్తల్లో ఉంటూ వస్తోన్న బంగార్రాజు చిత్రం అందులో ఒకటి. కళ్యాణ్ కృష్ణ ఈ స్క్రిప్ట్ పై గత కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నాడు. ఫైనల్ గా నాగ్ ను ఒప్పించగలిగాడు. ఈ ఏడాదే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనుంది.

మరోవైపు టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున కొత్తమ్మాయితో రొమాన్స్ పండించనున్నాడట. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండే ఈ సినిమాలో విభిన్న తరహా లవ్ స్టోరీ ఉంటుందిట. అందుకోసం అనిక సురేంద్రన్ ను హీరోయిన్ ను తీసుకుంటున్నారట.

- Advertisement -

తమిళ్, మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All