Homeటాప్ స్టోరీస్చిరు బాలయ్య లతో సినిమా చేయనంటున్న నాగ్

చిరు బాలయ్య లతో సినిమా చేయనంటున్న నాగ్

nagarjuna sensational comments on chiranjeevi and balakrishnaఅగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ లతో మల్టీస్టారర్ సినిమాలు చేయనని అలా చేస్తే ముసలోళ్ల సినిమా అంటారని అందుకే వాళ్లతో సినిమా చేయనని సంచలన వ్యాఖ్యలు చేసాడు అక్కినేని నాగార్జున . నా వయసు 59 సంవత్సరాలు అయినప్పటికీ నాకు ఇంకా 25 సంవత్సరాలు మాత్రమే అనుకుంటానని అలా ఉండటమే కాదు అలాగే ఆలోచిస్తానని అందుకే ఇలా ఉన్నానని అంటున్నాడు నాగ్ . తాజాగా నాగార్జున నాని తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు దేవదాస్ , ఆ సినిమా ఈనెల 27న విడుదలకు సిద్ధమైంది . దాంతో యంగ్ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేస్తానని అప్పుడు నేను కూడా యంగ్ అనే ఫీలౌతానని అదే సీనియర్ హీరోలతో చేస్తే ముసలోళ్ల సినిమా అంటారని అందుకే చిరంజీవి , బాలకృష్ణ లతో సినిమా చేయనని చెప్పేసాడు నాగార్జున .

తెలుగులోనే కాకుండా తమిళ్ లో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు అలాగే హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమా చేస్తున్నాడు . యంగ్ హీరోలతో సినిమా చేయడానికి అభ్యంతరం లేదని , ఇక సోలో గా కూడా చేస్తున్నానని ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని త్వరలోనే దానికి సంబందించిన అన్ని వివరాలు చెబుతానని అంటున్నాడు నాగార్జున .

- Advertisement -

English Title: nagarjuna sensational comments on chiranjeevi and balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All