Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ చిన్నల్లుడు కూడా రాజకీయాల్లోకి

బాలకృష్ణ చిన్నల్లుడు కూడా రాజకీయాల్లోకి

balakrishnas second son in law in politicsనందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది . తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన ఎం వివిఎస్ మూర్తి మనవడు ఈ భరత్ . తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు రెండుసార్లు , విశాఖ పట్టణం పార్లమెంట్ సభ్యుడిగా 1991 – 96 వరకు , ఆ తర్వాత 1999 – 2004 వరకు మొత్తంగా రెండుసార్లు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు ఎం వివిఎస్ మూర్తి . అలా బాలయ్య చిన్నల్లుడి కి చిన్నప్పటి నుండే రాజకీయం వంటబట్టింది అంతేకాదు కావూరి సాంబశివరావు కూడా బాలయ్య అల్లుడి కి తాత అవుతాడు దాంతో కూడా కావచ్చు బాలయ్య చిన్నల్లుడి కి రాజకీయాలపై గాలి మళ్లిందట .

బాలయ్య కుటుంబం కూడా రాజకీయాల్లో ఉంది , ఇక పెద్దల్లుడు మేనల్లుడు అయిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ , పంచాయత్ రాజ్ శాఖా మంత్రిగా పనిచేస్తున్నాడు . ఇక చిన్నల్లుడు కూడా రాజకీయాల్లోకి వస్తే మొత్తం రాజకీయ కుటుంబమే అవుతుంది . ఎం వివిఎస్ మూర్తి వృద్ధుడు కావడంతో అతడి స్థానంలో బాలయ్య చిన్నల్లుడు విశాఖపట్టణం నుండి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది . బాలయ్య కు బ్రాహ్మణి , తేజస్విని ఇద్దరు కూతుర్లు కాగా పెద్దల్లుడు నారా లోకేష్ చిన్నల్లుడు భరత్ .

- Advertisement -

English Title: balakrishnas second son in law in politics

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All