Homeటాప్ స్టోరీస్`బంగార్రాజు`కి ముహూర్తం కుదిరిందా?

`బంగార్రాజు`కి ముహూర్తం కుదిరిందా?

`బంగార్రాజు`కి ముహూర్తం కుదిరిందా?
`బంగార్రాజు`కి ముహూర్తం కుదిరిందా?

కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున న‌టించిన చిత్రం  ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ మూవీ నాగ్ కెరీర్‌లోనే భారీ విజ‌యాన్ని సాధించింది. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరి కింగ్ నాగార్జున కెరీర్‌లో మెమ‌ర‌బుల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర‌నే టైటిల్‌గా ప్ర‌క‌టించి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌ని చేయ‌బోతున్నామంటూ నాగార్జున ప్ర‌క‌టించారు.

అయితే గ‌త కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ గ్యాప్‌లో ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ రెండు చిత్రాల్ని రూపొందించారు. గ‌త ఏడాది ఉగాదికి ఈ ప్రీక్వెల్‌ని స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ అదీ కుద‌ర‌లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రింత ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఈ నెల రెండవ వారం నుండి ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది. కళ్యాణ్ కృష్ణ ఈ మూవీ స్క్రిప్ట్ వ‌ర్క్ కోసం ఏడాది కాలంగా వ‌ర్క్ చేస్తున్నారు.  ఇటీవ‌లే ప్రీ ప్రొడక్షన్ కార్యక్ర‌మాల్ని కూడా పూర్తి చేసిన‌ట్టు తెలిసింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడానికి ఫిల్మ్ యూనిట్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఇందులో నాగ చైతన్య ఒక ముఖ్యమైన పాత్రను పోషించ‌బోతున్నారు. రమ్య కృష్ణ మళ్ళీ నాగార్జునతో జత కట్టనుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని మేక‌ర్స్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All