Homeటాప్ స్టోరీస్త‌మ్ముడి సినిమాల‌పై నాగ‌బాబు కామెంట్‌!

త‌మ్ముడి సినిమాల‌పై నాగ‌బాబు కామెంట్‌!

త‌మ్ముడి సినిమాల‌పై నాగ‌బాబు కామెంట్‌!
త‌మ్ముడి సినిమాల‌పై నాగ‌బాబు కామెంట్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. `పింక్‌` రీమేక్ ఆధారంగా `వ‌కీల్‌సాబ్‌` చిత్రం చేస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్నఈ చిత్రం త‌రువాత త‌రువాత క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ఓ  పిరియాడిక్ చిత్రాన్ని చేస్తున్నారు.

`వ‌కీల్‌సాబ్‌` చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నివ‌ర‌ధికంగా వాయిదా ప‌డింది. మే నుంచి మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇక క్రిష్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం కూడా ఆగిపోయింది.  ఈ రెండు చిత్రాల‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ బాబు స్పందించారు.

- Advertisement -

`వ‌కీల్‌సాబ్‌` సినిమా విష‌యంలో ప‌వ‌న్ తాను ముందు నుంచే ఆస‌క్తిగా వున్న‌ట్టు త‌న‌కు చెప్పాడ‌ని, త‌న బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ క‌థ‌ని ముందు నుంచే చేయాల‌ని అనుకుంటున్నాన‌ని త‌న‌కు వివ‌రించాడ‌ని, తెలుగులో మాత్రం చాలా మార్పులు చేశార‌ని పేర్కొన్నారు. ఇక క్రిష్ సినిమా గురించి వెల్ల‌డిస్తూ ఇది మొఘ‌ల్ సామ్రాజ్యానికి సంబంధించిన కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో సాగుతుంద‌ని విన్నాన‌ని, అయితే ఈ రెండు చిత్రాలు చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందుతున్నాయ‌ని, వీటి రిలీజ్ కోసం తాను ఎదురుచూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All