Homeటాప్ స్టోరీస్త‌రుణ్‌భాస్క‌ర్ - చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!

త‌రుణ్‌భాస్క‌ర్ – చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!

త‌రుణ్‌భాస్క‌ర్ - చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!
త‌రుణ్‌భాస్క‌ర్ – చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!

`పెళ్లి చూపులు` చిత్రంతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ మూవీ త‌రువాత విశ్వ‌క్‌సేన్‌తో `ఈ న‌గ‌రానికి ఏమైంది` అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. ఆ త‌రువాత హీరోగా `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హ‌డావిడి చేసిన త‌రుణ్ భాస్క‌ర్ త్వ‌ర‌లో వెంక‌టేష్‌తో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఆ మూవీ ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. త‌రుణ్ భాస్క‌ర్ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి వెంక‌టేష్ నార‌ప్ప‌, తాజాగా `దృశ్యం2`, ఎఫ్‌3 చిత్రాలలో న‌టిస్తున్నారు. దీంతో త‌రుణ్‌భాస్క‌ర్ ఆయ‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడు. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌కు క‌థ వినిపించార‌ట‌. స్టోరీ న‌చ్చ‌డంతో చై గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌.

- Advertisement -

ఈ మూవీని ఓ ప్ర‌ముఖ లీడింగ్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ నిర్మించ‌బోతోంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసి విక్ర‌మ్ కె. కుమార్‌తో `థ్యాంక్యూ` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All