Homeటాప్ స్టోరీస్చైతూ కోసం క్రేజీ టైటిల్ సెట్ అయిందిగా

చైతూ కోసం క్రేజీ టైటిల్ సెట్ అయిందిగా

చైతూ కోసం క్రేజీ టైటిల్ సెట్ అయిందిగా
చైతూ కోసం క్రేజీ టైటిల్ సెట్ అయిందిగా

నాగ చైతన్య ప్రస్తుతం తన జోన్ లో హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. 25 కోట్ల రేంజ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. 2019 చైతూకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మజిలీ చిత్రం ద్వారా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న చైతు, వెంకటేష్ తో కలిసి ఏడాది చివర్లో మరో సూపర్ హిట్ ను అందుకున్నాడు. మొత్తంగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నాగ చైతన్య మంచి ఊపు మీదనున్నాడనే చెప్పాలి.

ప్రస్తుతం లవ్ స్టోరీస్ ను సూపర్ గా హ్యాండిల్ చేస్తాడనే పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవితో కలిసి లవ్ స్టోరీ చేస్తున్న నాగ చైతన్య, షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఈ చిత్ర మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వకముందే చైతూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను లైనప్ చేసి పెట్టుకున్నాడు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న పరశురామ్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసారని తెలిసింది.

- Advertisement -

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నాగేశ్వరరావు అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ప్రస్తుతం ఆ బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ లో సినిమా ఇదొక్కటే. దానికి నాగ చైతన్య హీరో కావడం, నాగేశ్వరరావు అనే టైటిల్ ఉండడం, అన్నీ రిలవెంట్ గా అనిపిస్తుండడంతో నాగ చైతన్య తర్వాత సినిమాకు క్రేజీ టైటిల్ సెట్ అయింది అనుకోవచ్చు. అసలే గీత గోవిందం దర్శకుడు కావడంతో బజ్ ఈ చిత్రంపై భారీగా ఉంటుంది. ఇప్పుడీ టైటిల్ తో అది మరింతగా పెరుగుతుందనే చెప్పాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All