Homeటాప్ స్టోరీస్మరో వారం రోజులు లడఖ్ లోనే షూటింగ్ చేయనున్న చైతన్య

మరో వారం రోజులు లడఖ్ లోనే షూటింగ్ చేయనున్న చైతన్య

మరో వారం రోజులు లడఖ్ లోనే షూటింగ్ చేయనున్న చైతన్య
మరో వారం రోజులు లడఖ్ లోనే షూటింగ్ చేయనున్న చైతన్య

అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అధికారికంగా తెలియజేసారు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా షూటింగ్ లడఖ్ లో సాగుతోంది. గత వారం రోజుల నుండి నాగ చైతన్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

మరో వారం రోజుల పాటు నాగ చైతన్య లడఖ్ లోనే షూట్ చేస్తాడు. దీంతో తన పోర్షన్ షూటింగ్ పూర్తవుతుంది. లాల్ సింగ్ చద్దా లడఖ్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుంది. ఈ చిత్రంలో చైతన్యది కామియో పాత్ర. ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాడు చైతూ.

- Advertisement -

తెలుగులో చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ చివరి దశలో ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All