Homeటాప్ స్టోరీస్నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!
నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ , అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తియింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించింది. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఇందు కోసం ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ఇందులో లంగా ఓణీ ధ‌రించి సాయి ప‌ల్ల‌వి క‌నిపిస్తుండ‌గా, గాలి ప‌టం ఎగ‌రేస్తూ నాగ‌చైన్య క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర సాంగ్ ప్రోమోతో పాటు టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

- Advertisement -

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి సిటీకి వ‌చ్చిన ఓ జంట ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. సున్నిత‌మైన భావోద్వేగాల స‌మాహారంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీతో శేఖ‌ర్‌ క‌మ్ముల‌, సాయి ప‌ల్ల‌వి `ఫిదా` మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌డం గ్యారెంటీ అని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All