Homeన్యూస్చైతు స్టామినా చూపిస్తున్న లవ్ స్టోరీ కలక్షన్స్.. 3వ రోజు కుమ్మేసింది..!

చైతు స్టామినా చూపిస్తున్న లవ్ స్టోరీ కలక్షన్స్.. 3వ రోజు కుమ్మేసింది..!

Naga Chaitanya Love Story 3 Days Cellections

అక్కినేని వారసుడిగా నాగ చైతన్య ప్రస్తుతం సూపర్ జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజైన లవ్ స్టోరీ సినిమా నాగ చైతన్య ఖాతాలో సూపర్ హిట్ గా నిలిచింది. మజిలీ, వెంకీమామ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ గా నటించిన లవ్ స్టోరీ సినిమాకు ముందు నుండి సూపర్ బజ్ ఉంది.

- Advertisement -

ఇక రిలీజ్ తర్వాత కూడా లవ్ స్టోరీ మేనియా కొనసాగుతుంది. లవ్ స్టోరీ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా 1 మిలియన్ కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. కరోనా పాండమిక్ తర్వాత మిలియన్ క్రాస్ చేసిన సినిమాగా లవ్ స్టోరీ రికార్డ్ సృష్టించింది.

ఏపి, తెలంగాణాలో కూడా లవ్ స్టోరీ మంచి వసూళ్లను రాబెడుతుంది. ఈ సినిమా రిలీజ్ డే నాడు 7.13 కోట్లు, రెండవ రోజు 5.08 కోట్లు తెలుగు రెండు రాష్ట్రాల్లో షేర్ రాబట్టిన ఈ సినిమా థర్డ్ డే కూడా అదే ఫాం కొనసాగించింది. ఏపీ తెలంగాణాలో 3వ రోజు 5.19 కోట్లతో దూసుకెళ్తుంది లవ్ స్టోరీ. 3 రోజుల్లో మొత్తం 17.40 షేర్(28.23 గ్రాస్) కోట్లతో నాగ చైతన్య స్టామినా చూపిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All