Homeన్యూస్ఆ హీరోయిన్ తో నాగ చైతన్య లవ్ ట్రాక్..!

ఆ హీరోయిన్ తో నాగ చైతన్య లవ్ ట్రాక్..!

Naga Chaitanya Heroine Love Track

ఓ పక్క సమంతతో డైవర్స్ కు రెడీ అయిన నాగ చైతన్య తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టాలని చూస్తున్నాడు. అందుకే ఏమాత్రం ఖాళీ లేకుండా కమిట్ అయిన సినిమాలను చేస్తున్నాడు. ఈ క్రమంలో నాగార్జునతో కలిసి చేస్తున్న బంగార్రాజు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు నాగ చైతన్య. సినిమాలో చైతుకి జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది.

- Advertisement -

కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న బంగార్రాజు సినిమాలో చైతు, కృతి శెట్టిల మధ్య లవ్ ట్రాక్ బాగా వస్తుందని చెబుతున్నారు. మైసూర్ లో వీరికి సంబందించిన లవ్ ట్రాక్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. సినిమాలో ఈ ఎపిసోడ్ యూత్ ఆడియెన్స్ ను మెప్పిస్తుందని అంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగ చైతన్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

బంగార్రాజు కంటే ముందు విక్రం కె కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా థ్యాంక్ యు సినిమా వస్తుంది. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలతో చైతు తన హిట్ మేనియా కొనసాగించేలా ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All