Homeన్యూస్పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నాగ అన్వేష్

పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నాగ అన్వేష్

పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నాగ అన్వేష్
పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నాగ అన్వేష్

మొన్నటి వరకు బ్యాచ్లర్ జీవితం గడిపిన హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున సినీ స్టార్స్ ఓ ఇంటివారు అయ్యారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాగ అన్వేష్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు.

`సింధూరపువ్వు` ఫేమ్ కృష్ణారెడ్డి తనయుడు నాగ అన్వేష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ప్రస్తుతం నిశ్చితార్దపు పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా నాగ అన్వేష్.. కావ్య అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా..వారు పెళ్ళికి ఒప్పుకున్నారు.  కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపనీ డైరెక్టర్ విజయ్ కుమార్.

- Advertisement -

ఇక నాగ అన్వేష్ సినిమాల విషయానికి వస్తే.. `వినవయ్యా రామయ్యా` మూవీ తో 2015 లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రెండేళ్ల విరామం తరువాత `ఏంజెల్` మూవీలో నటించాడు. ఈ చిత్రాన్ని నాగ అన్వేష్ తండ్రి సింధూరపువ్వు కృష్ణారెడ్డి స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం ఇతడు సినిమాలేవీ చేయడం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All