Homeటాప్ స్టోరీస్థియేట‌ర్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలా...?

థియేట‌ర్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలా…?

థియేట‌ర్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలా...?
థియేట‌ర్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలా…?

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అన్ని వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సినిమా థియేట‌ర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌దు. షూటింగ్‌లకు ప్ర‌భుత్వం ఎప్పుడు అనుమ‌తులు జారీ చేస్తుందో తెలియ‌దు.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కి అయినా అనుమ‌తు‌లు ఇస్తారా? అంటే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక థియేట‌ర్లు తెరిచినా క‌రోనా భ‌యంతో జ‌నాలు సాధార‌ణంగా థియేట‌ర్‌ల‌కు వ‌స్తారా? అన్న‌ది ప్రధాన స‌మ‌స్య‌గా మారింది. గ‌త 50 రోజులుగా లాక్‌డౌన్ న‌డుస్తుండ‌టంతో జ‌నం అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. ఇంట‌ర్నెట్ అధికంగా వాడుతూ ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులకు అనుగుణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కూడా రేట్లు త‌గ్గించి భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేయ‌డం మొద‌లుపెట్టాయి.

- Advertisement -

దీంతో మునుపెన్న‌డూ లేనంత‌గా ఓటీటీల‌కు భారీ స్థాయిలో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇది థియేట‌ర్ల‌కు పెద్ద ఇబ్బందిగా మారే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌పై `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను త‌ర‌చుగా నిర్మాత ద‌గ్గుబాటి సురేష్‌, రానాతో మాట్లుడూంటాన‌ని, ఈ క్ర‌మంలో థియేట‌ర్ల‌కు అధిక సంఖ్య‌లో ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించ‌డానికి బీర్‌, బ్రీజ‌ర్‌, వైన్ లాంటివి స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌భుత్వం లైసెన్స్ ఇస్తుందా? అస‌లు త‌న అలోచ‌న స‌మంజ‌సంగానే వుందా? అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఫారిన్ త‌ర‌హాలో థియేట‌ర్ల‌లో మ‌ద్యాన్ని పారిస్తే ఫ్యామిలీ ఆడియ‌న్స్ రావ‌డం క‌ష్ట‌మే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All