Homeటాప్ స్టోరీస్బ్యాట్ మెన్ పెయింటింగ్‌తో అద‌ర‌గొట్టిందిగా

బ్యాట్ మెన్ పెయింటింగ్‌తో అద‌ర‌గొట్టిందిగా

బ్యాట్ మెన్ పెయింటింగ్‌తో అద‌ర‌గొట్టిందిగా
బ్యాట్ మెన్ పెయింటింగ్‌తో అద‌ర‌గొట్టిందిగా

హీరోయిన్ అన‌గానే మ‌న‌కు వినిపించే మాట గ్లామ‌ర్ డాల్ అంతే. వారిలో మ‌రో కోణం కూడా వుంటుంద‌ని గ్లామ‌ర్‌, న‌ట‌నే కాకుండా వారిలో మ‌రెంతో నైపుణ్యం కూడా వుంటుంద‌ని ఎవ‌రూ గుర్తించ‌రు. అది త‌ప్ప‌ని హీరోయిన్‌లంటే కేవ‌లం గ్లామ‌ర్ బొమ్మ‌లు మాత్ర‌మే కాద‌ని త‌మ‌లోనూ ఎవ‌రూ ఊహించ‌ని టాలెంట్ దాగి వుంటుంద‌ని నిరూపిస్తోంది న‌భా న‌టేష్‌.

త‌న‌లో న‌ట‌న మాత్ర‌మే కాదు ఎక్స్‌ట్రా టాలెంట్ కూడా వుంద‌ని నిరూపిస్తోంది. పెయింటిగ్ కూడా వేయ‌గ‌ల‌న‌ని బ్యాట్ మెన్ పెయింగ్ వేసి త‌న కొత్త క‌ళ‌ని బ‌య‌ట‌పెట్టి అద‌ర‌గొట్టింది. మూడు అడుగుల బ్యాట్ మెన్ పెయింటింగ్‌ని వేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉన్న‌ట్టుండి న‌భా న్యూ టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టేస‌రికి నెటిజ‌న్స్ అంతా అవాక్క‌వుతున్నారు.

- Advertisement -

త‌ను వేసిన బ్యాట్ మెన్ పెయింటింగ్‌ని సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది.  ఈ పెయింటింగ్‌లో పాటు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకుంది. బ్యాట్ మెన్‌కి ఈ పెయింటింగ్ ఓ నివాళి.  ఈ ప్ర‌క్రియ కోసం 6/7 స‌మ‌యాన్ని తీసుకున్నాన‌ని వెల్ల‌డించింది. ఆ స‌మ‌యాన్ని చాలా ఆనందించాన‌ని, ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. బ్యాట్ మెన్ అభిమానులుగా మీరంతా గ‌ర్వ‌ప‌డ‌తారంది. న‌భా న‌టేష్ ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, అల్లుడు అదుర్స్ చిత్రాల్లో న‌టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All