Homeటాప్ స్టోరీస్ఆయనా నేను కలిస్తే ఫుడ్, ఫ్రూట్స్ & లైఫ్ - నభా నటేష్

ఆయనా నేను కలిస్తే ఫుడ్, ఫ్రూట్స్ & లైఫ్ – నభా నటేష్

Nabha Natesh About Raviteja
Nabha Natesh About Raviteja

కొన్నిసార్లు ఆర్టిస్టులకు వాళ్ళు చేసే సినిమా ఎంతగా పేరు తెస్తుంది అంటే వాళ్ళు గతంలో చేసిన సినిమాలను కూడా జనాలు మరిచిపోయే అంత.! టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ పరిస్థితి అలాగే ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా కు ముందు వరకు ఆమె చేసిన సినిమాలలో ఆమె పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ జనాలు మాత్రం ఇప్పటికీ ఇస్మార్ట్ శంకర్ ఫీవర్ నుంచి బయటికి రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని డైలాగ్స్ చెప్పమని పాటలకు డాన్స్ చేయమని అడుగుతున్నారు అని నభా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆ సినిమాలో వరంగల్ పిల్లగా నభా నటేష్ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు నభా నటేష్ మళ్లీ “డిస్కో రాజా” అనే సినిమాతో మన ముందుకు వస్తోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు “మానగరం” లాంటి డిఫరెంట్ మూవీస్ డైరెక్షన్ చేసిన విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రవితేజ ఈ సినిమా లో నభా నటేష్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో కూడా నటిస్తున్నాడు.

- Advertisement -

ఈ సందర్భంగా డిస్కో రాజా సినిమా విశేషాలు పంచుకుంటూ, నభా నటేష్ పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. రవితేజ గారి “విక్రమార్కుడు” సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే కిక్ సినిమా అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని అలాంటి వ్యక్తితో తాను కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. రవితేజ ఎంతో పాజిటివ్ పర్సన్ అని, ఆయన తను కలిస్తే ఎప్పుడు ఫుడ్ గురించి లైఫ్ గురించి ముఖ్యంగా రవితేజ గారికి ఉన్న ఆర్గానిక్ ఫార్మ్ లో పండే ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటాం అని చెప్పింది. ఈ సినిమాలో నభా బ్యాంక్ ఉద్యోగిని గా, వాహనాలకు ఇచ్చిన లోన్ లను రికవర్ చేసుకునే పాత్రలో నటిస్తోంది. డిస్కో రాజా సినిమా జనవరి 24న రిలీజ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All