Homeటాప్ స్టోరీస్మైత్రి నిర్మాతలు భారీ రిస్క్ కు సిద్ధమయ్యారు

మైత్రి నిర్మాతలు భారీ రిస్క్ కు సిద్ధమయ్యారు

మైత్రి నిర్మాతలు భారీ రిస్క్ కు సిద్ధమయ్యారు
మైత్రి నిర్మాతలు భారీ రిస్క్ కు సిద్ధమయ్యారు

మైత్రి మూవీస్ సంస్థ.. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ తర్వాత మంచి విజయాలు సాధించింది. మొదట భారీ చిత్రాలకే పరిమితమైనా కూడా క్రమంగా మీడియం బడ్జెట్ సినిమాలవైపు కూడా ఒక చూపు చూసింది. అయితే భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చిన విజయాలు మీడియం బడ్జెట్ సినిమాలతో అంతగా రాలేదు. రంగస్థలం సినిమాతో మంచి చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ నుండి మళ్ళీ ఆ స్థాయి సినిమా రాలేదు. దర్శకుడు సుకుమార్ తో మైత్రి సంస్థకు మంచి అనుబంధం ఏర్పడింది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేయబోయే అల్లు అర్జున్ సినిమాకు మైత్రి సంస్థనే నిర్మాత. షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలవుతుంది అనుకుంటుండగా కరోనా దెబ్బ పడింది.

అంతే కాకుండా సుకుమార్ తో కలిసి నిర్మాణ భాగస్వామ్యం తీసుకుని సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉప్పెన అనే చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ సహ నిర్మాత అయినా కానీ మైత్రినే మొత్తం పెట్టుబడి పెట్టుకుంది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లే. అయినా కూడా ఉప్పెన చిత్రంపై దాదాపు 20 కోట్ల పెట్టుబడి పెట్టారు.

- Advertisement -

ఉప్పెన చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా వల్ల విడుదల వాయిదా పడింది. ఈలోగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు. విడుదలైన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే ఎంత రెస్పాన్స్ తెచ్చుకున్నా కొత్త ముఖాలపై 20 కోట్ల  పైన రిస్క్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. దాంతో నిర్మాతలు స్వయంగా ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో విడుదల చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. సాటిలైట్, డిజిటల్ డీల్ ఇంకా క్లోజ్ చేయలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం బట్టి ఆ డీల్ ను క్లోజ్ చేయొచ్చనుకుంటున్నారు. ఏదేమైనా సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడమంటే అది చాలా రిస్క్. అందులోనూ ఖర్చులన్నీ కలుపుకుని దాదాపు 22 కోట్ల రిస్క్ అంటే మైత్రి వాళ్ళ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All