Homeటాప్ స్టోరీస్మైత్రి మూవీస్ సంస్థ కు ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా

మైత్రి మూవీస్ సంస్థ కు ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా

will balakrishna give a chance to mythri movie makersమైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . దాంతో ఆ సంస్థలో నటించడానికి పలువురు హీరోలు ఇష్టపడుతున్నారు . అయితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో నటించలేదు , దాంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ బాలయ్య తో ఓ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చింది . పైగా దర్శకుడు బోయపాటి శ్రీను తో కూడిన కాంబినేషన్ లో సినిమా చేయాలనీ భావిస్తున్నారు . బాలయ్య – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన ” సింహా ” , ”లెజెండ్ ” చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి దాంతో బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ సినిమాపై కర్చీఫ్ వేశారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు .

అయితే బాలయ్య ఒప్పుకోవాల్సి ఉంది , బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మైత్రి మూవీస్ సంస్థలో ఈ కాంబినేషన్ లో మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది లేదంటే మరో బ్యానర్ లో ఉంటుంది . బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో మూడో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం . ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నాడు , ఆ సినిమా కంప్లీట్ అయ్యాక బోయపాటి తో సినిమా చేయనున్నాడు .

- Advertisement -

ఈ బ్యానర్ పై ఇప్పటివరకు నిర్మించిన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . కాగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చిత్రాలు సవ్యసాచి , అమర్ అక్బర్ ఆంటోనీ లతో పాటు రవితేజ తోనే మరో సినిమా చేస్తున్నారు . ఇక ఇప్పుడేమో బాలయ్య తో సినిమా చేయాలనీ చూస్తున్నారు మరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? లేదా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All