Homeటాప్ స్టోరీస్తన సినిమాల లైనప్ ను మరోసారి కన్ఫర్మ్ చేసిన మహేష్

తన సినిమాల లైనప్ ను మరోసారి కన్ఫర్మ్ చేసిన మహేష్

తన సినిమాల లైనప్ ను మరోసారి కన్ఫర్మ్ చేసిన మహేష్
తన సినిమాల లైనప్ ను మరోసారి కన్ఫర్మ్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అనుకోకుండా మరోసారి బ్రేక్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనుకోకుండా కోవిడ్ కారణంగా మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. నిన్న మహేష్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల లైనప్ పై స్పందించాడు.

- Advertisement -

ముందు సర్కారు వారి పాట, ఆ తర్వాత త్రివిక్రమ్ చిత్రం దాని తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందని మహేష్ చెప్పాడు. రాజమౌళితో పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు రివీల్ చేసాడు. అయితే ఈ సినిమాను బాహుబలితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదని, ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత వేరని, కాకపోతే దీని గురించి మాట్లాడడం చాలా ఎర్లీ అవుతుందని తెలిపాడు మహేష్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All