
స్టార్ హీరోల పిల్లల్లో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మహేష్ పిల్లలు గౌతమ్, సితార. లాక్‌డౌన్ సమయంలో కానీ, సినిమా షూటింగ్‌లతో బిజీగా వున్నా వీరి కోసం మహేష్ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ సమయాన్ని మహేష్ వీరితోనే గడిపేసిన విషయం తెలిసిందే. మహేష్ వైఫ్ నమ్రత కూడా పిల్లలకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా గౌతమ్, సితార స్విమ్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన నమ్రత ఆసక్తకరమైన కామెంట్ చేశారు. గృహిణిగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తున్న నమ్రత నిత్యం సితార, గౌతమ్‌లకు సంబంధించిన ఫొలోలని షేర్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. `మా పిల్లలు ఓలింపిక్స్‌కి సిద్ధమవుతున్నారు. ప్రతీ విషయంలో ప్రావీణ్యం వుండాలని చెబుతుంటాను` అన్నారు.
అంతే కాకుండా ఆటలు, స్విమ్మింగ్ వల్ల పిల్లల మెదడు ఉత్తేజిత మవుతుందని స్పష్టం చేసింది. పిల్లల విషయంలో నమ్రత తీసుకుంటున్న కేర్‌కి నెటిజన్స్‌తో పాటు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా వుంటే మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.