
స్టార్ హీరో మహేష్ బాబు ఎంత బిజీగా వున్నా పిల్లల విషయంలో మాత్రం సమయం కేటాస్తూ వారికి ఎప్పుడూ అందుబాటులో వుంటుంటారు. మహేష్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తుంటారాయన. లాక్‌డౌన్ కారణంగా నిత్యం ఇంటి పట్టునే వుంటున్న మహేష్ వారితో చాలా సమయాన్ని స్పెండ్ చేస్తూ కనిపించారు. వారితో ఆటలాడటమే కాకుండా వారితో కలిసి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వారిలో నూతనోత్తేజాన్ని కలిగించారు.
పిల్లలతో కలిసి జాలీగా గడిపిన సందర్భాలకు సంబంధించిన వీడియోలతో పాటు ఫొటోలని సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో పంచుకున్నారు కూడా. నమ్రత కూడా పిల్లలకు సంబంధించిన ఫొటోలని, వీడియోలని నిత్యం షేర్ చేస్తూ వుంటోంది. తాజాగా సోమవారం తనయుడు గౌతమ్ 14వ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్స్, ఫ్యాన్స్ గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా మహేష్ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. `హ్యాపీ 14 మై సన్. నీ ఎదుగుదల చూస్తుంటే గర్వంగా వుంది. డోరామన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు ఎదిగిన జర్నీ సూపర్. ఎప్పటికీ సంతోషంగా వుండాలి లవ్ యూ` అంటూ మహేష్ ట్వీట్ చేయమడం ఆకట్టుకుంటోంది. ఈ ట్వీట్‌కు 50 వేల లైక్స్, 15 వేల కామెంట్స్ వచ్చాయి.