Homeటాప్ స్టోరీస్స్పిన్ మాంత్రికుడి బ‌యోపిక్ టైటిల్ పోస్ట‌ర్!

స్పిన్ మాంత్రికుడి బ‌యోపిక్ టైటిల్ పోస్ట‌ర్!

స్పిన్ మాంత్రికుడి బ‌యోపిక్ టైటిల్ పోస్ట‌ర్!
స్పిన్ మాంత్రికుడి బ‌యోపిక్ టైటిల్ పోస్ట‌ర్!

శ్రీ‌లంక క్రికెట‌ర్, స్పిన్ మాంత్రికుడు ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. క్రికెట్ లెజెండ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో త‌మిళ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి `800` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ని విజ‌య్ సేతుప‌తి మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

మురళీధ‌రన్ 800 టెస్ట్ వికెట్లు సాధించారు. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ గా ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్రలో స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని సాయంత్రం 6 గంటలకు బయటికి వస్తుంది. మురళి జీవితం మరియు క్రికెట్ వృత్తిని ప్రదర్శించే ఈ బయోపిక్‌ను ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించబోతున్నారు.

- Advertisement -

ఓ సాధారణమైన స్పిన్నర్ స్థాయి నుండి గొప్ప బౌలర్లలో ఒకరిగా ఎదిగే క్ర‌మంలో మురళి తన కెరీర్ మొత్తంలో చాలా హెచ్చు తగ్గులు చూశాడు. ఈ బయోపిక్‌లో ఆ అంశాల‌న్నింటిని చూపించ‌బోతున్నార‌ట‌.  శ్రీ‌లంక జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క భూమిక‌ని పోషించిన‌ బౌలర్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినందున ఈ చిత్రం బ‌హు భాషలలో కూడా డబ్ చేయ‌బోతున్నారు.  మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ మరియు వివేక్ రంగచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All