Homeన్యూస్మౌనమే ఇష్టం రివ్యూ

మౌనమే ఇష్టం రివ్యూ

Mouname Ishtam Movie Reviewమౌనమే ఇష్టం రివ్యూ :
నటీనటులు : రామ్ కార్తీక్ , పార్వతి అరుణ్ , రీతూ చౌదరి, నాజర్
సంగీతం : వివేక్ మహాదేవ్
నిర్మాత : ఆశా అశోక్
దర్శకత్వం : అశోక్ కుమార్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 15 మార్చి 2019

ప్రముఖ కళా దర్శకులు అశోక్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం ” మౌనమే ఇష్టం ” . రామ్ కార్తీక్పార్వతి అరుణ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

మాయ ( పార్వతి అరుణ్ ) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు వరుణ్ ( రామ్ కార్తీక్ ) . సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన మాయ ఆకలితో అలమటించే వాళ్ళ కోసం సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది , దాంతో ఆమెకు దగ్గర కావడానికి , పరిచయం పెంచుకోవడానికి మిగిలిపోయిన ఫుడ్ అంటూ స్విగ్గీ లో ఆర్డర్ ఇస్తూ అడ్డంగా దొరికిపోతాడు మాయకు . ముందు వరుణ్ పై కోప్పడినా ఆ తర్వాత అతడు నన్ను ఇంప్రెస్ చేయడానికే ఇలా చేసాడని తెలుసుకొని ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు . ఆ ఫ్రెండ్ షిప్ క్రమంగా ప్రేమగా మారుతుంది . అయితే ఇద్దరికీ కూడా ఎవరు ముందుగా ప్రపోజ్ చేసినా పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు ? ఎందుకంటే  నాకు కాబోయే వాడ్ని నేనే ముందుగా ఎంచుకోవాలి అన్నది మాయ మనస్తత్వం కాగా తాత కిచ్చిన మాట కోసం కట్టుబడే మనస్తత్వం వరుణ్ ది . దాంతో ఇద్దరూ తీవ్ర మానసిక సంఘర్షణ కు లోనౌతారు . చివరకు మాయ – వరుణ్ లు ఒక్కటయ్యారా ? లేదా ? వాళ్ళ సమస్య ఎలా పరిష్కారం అయ్యింది అన్నదే ఈ మౌనమే ఇష్టం .

హైలెట్స్ :

విజువల్స్

సంగీతం

నిర్మాణ విలువలు

నటీనటుల ప్రతిభ :

పార్వతి అరుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది . మలయాళ భామ అయిన పార్వతి అరుణ్ నటనలో తనది అందెవేసిన చేయి అనిపించింది . అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది . రామ్ కార్తీక్ ఎప్పటి లాగే తన పాత్రకు న్యాయం చేసాడు . ఇద్దరి జోడి కూడా బాగుంది . ముఖ్యమైన పాత్రలో నాజర్ , సూర్య , అభయ్ తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది జెడి రామతులసి అందించిన విజువల్స్ . తక్కువ లైటింగ్ ని ఉపయోగించి అద్భుతమైన విజువల్స్ చూపించాడు . పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి . నేపథ్య సంగీతం తో అలరించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . డైలాగ్స్ కొన్ని చోట్ల ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి . ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది . ఇక దర్శకుడు అశోక్ విషయానికి వస్తే …… మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు . అయితే అదే అంశం చుట్టూ ఎక్కువసేపు తిప్పిన భావన కలిగింది . మొత్తానికి యువతని , తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న మంచి అంశాన్ని టచ్ చేసాడు కానీ   ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటె ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

యువత మెచ్చే మౌనమే ఇష్టం

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All