
నాగ చైతన్య నటిస్తోన్న లవ్ స్టోరీ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ కు విశేష స్పందన లభించింది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ గా ఉండనుందని సమాచారం. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల చేయాలనీ భావించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతుండడంతో మే 22న చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆ డేట్ ను కూడా చిత్రం మిస్ కాబోతోందని తెలిసింది. ఈ సినిమా జులైకు షిఫ్ట్ అయిందని తాజాగా అందుతున్న సమాచారం.
అయితే అన్న ఖాళీ చేసిన డేట్ ను తమ్ముడు అందుకోనున్నట్లు తెలిసింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సూటబుల్ డేట్ ను అనుకుంటుండగా అన్న ఖాళీ చేసిన మే 22 అయితే బెటర్ అని భావించి అఖిల్ చిత్రానికి అదే డేట్ ను ఫిక్స్ చేసారు. సో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మే 22కి రావడం పక్కా అని తేలిపోయింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తోంది.