Homeటాప్ స్టోరీస్తిరిగి హైదరాబాద్ కు మకాం మార్చనున్న మోనాల్ గజ్జర్

తిరిగి హైదరాబాద్ కు మకాం మార్చనున్న మోనాల్ గజ్జర్

తిరిగి హైదరాబాద్ కు మకాం మార్చనున్న మోనాల్ గజ్జర్
తిరిగి హైదరాబాద్ కు మకాం మార్చనున్న మోనాల్ గజ్జర్

గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ చాలా కాలం క్రితమే టాలీవుడ్ లో సినిమాలు చేసింది. దాదాపు ఐదు సినిమాలు చేసినా కానీ ఎక్కడా బ్రేక్ రాకపోవడంతో తమిళం, మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే మలయాళంలో ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే అది బ్రేకప్ కు దారి తీయడంతో తిరిగి తన సొంత ఊరుకు వెళ్ళిపోయింది.

మళ్ళీ దాదాపు మూడేళ్ళ తర్వాత బిగ్ బాస్ అవకాశం రావడంతో మోనాల్ తిరిగి హైదరాబాద్ వచ్చింది. తన గ్లామర్ తో బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకుంది. 14 వారాల పాటు భాష తెలియకపోయినా సస్టైన్ అవ్వగలిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక మోనాల్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అది అవకాశాలను కూడా తీసుకొచ్చింది.

- Advertisement -

అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది అమ్మడు. ఇక ఓంకార్ నిర్వహిస్తోన్న డ్యాన్స్ షో డ్యాన్స్ ప్లస్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అటు ఓటిటి, ఇటు సినిమాల నుండి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో మోనాల్ తన మకాంను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని భావిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All