
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు హీరోలకు వార్నింగ్ ఇచ్చాడు. తనఫై ట్రోల్స్ , మిమ్స్ చేయాలనీ ఓ 50 మందిని నియమించుకొని ఆ పని చేయిస్తున్నారని..వారికీ తగిన శాస్త్రి తగులుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ అఫ్ ఇండియా అనే మూవీ చేసాడు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు.
ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ..సినిమా విశేషాలను పంచుకున్నారు. అలాగే తనపై వస్తున్న ట్రోల్స్ , మిమ్స్ ఫై స్పందించారు. ‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలే తప్ప, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను.
నిజానికి ట్రోలింగ్‌ను పట్టించుకోకూడదు. కానీ ఇవి హద్దులు మీరుతున్నాయి. అలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడానికనే నియమించుకుని ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. ఎవరూ సహాయపడరు’ అని వార్నింగ్ ఇచ్చారు. మరి ఆ ఇద్దరు హీరోలెవరు అనేది చెప్పలేదు.