Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పై పెద్ద కుట్ర జరుగుతోందట

పవన్ కళ్యాణ్ పై పెద్ద కుట్ర జరుగుతోందట

MeToo : Political conspiracy on pawan kalyanజనసేన స్థాపించి వచ్చే ఏడాది ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్న పవన్ కళ్యాణ్ పై పెద్ద కుట్ర జరుగుతోందట . ఇంతకీ పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసా …… ఓ స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం . ఓ వర్గం సదరు స్టార్ హీరోయిన్ ని కలిసి పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి ఆరోపణలు చేయాలనీ కోరగానే మొదట భయపడిందట అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని నచ్చజేప్పడమే కాకుండా , ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఆరోపణలు చేస్తే అవలీలగా నమ్మేస్తారని అతడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పడంతో సరే అని ఒప్పుకుందట .

అయితే మీడియాలో వచ్చి లైవ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయాలనీ కోరడంతో వెంటనే భయపడిపోయిందట . పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం లేదు , అలాగని కోపం లేదు కాబట్టి నాకు అనవసర విషయాలు వద్దు నన్ను వదిలేయండి ఇలా ఉండనివ్వండి అని ఆ డీల్ ని తిరస్కరించిందట . లేదంటే ఇప్పుడు మీడియాలో రచ్చ రచ్చ అయ్యుండేది . జనసేన తరుపున వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ . ఈలోగా ఇది జరిగి ఉంటే పెద్ద డ్యామేజ్ అయ్యుండేది . ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది కాబట్టి సరిపోయింది . ఎంతైనా రాజకీయాలు ఎంత నీచమో ! కొన్ని సంఘటనలు చూస్తే చాలు .

- Advertisement -

English Title: MeToo : Political conspiracy on pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All