Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించిన మంత్రి

పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించిన మంత్రి

TDP minister jawahar slams pawan kalyan పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాగా ఆరడుగుల అందగాడా ? అతడి కంటే అందంగా ఉన్నవాళ్లు ప్రతీ ఊరికి 20 మంది ఉన్నారంటూ ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ ని అవమానించాడు ఆంధ్రపదేశ్ మంత్రి జవహర్ . పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలోని యండగండిలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన మంత్రి జవహర్ పవన్ కళ్యాణ్ ని పూచిక పుల్ల లా తీసి పడేసాడు . పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసాడని అయితే తమ్ముడు పవన్ మాత్రం రిటైల్ పద్దతిలో అమ్మకానికి పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు .

వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ ముందుగా తన గురించి , తన కుటుంబం గురించి ఆలోచించి మాట్లాడాలని …… చిరంజీవి సినిమాల్లోకి రాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండేవాడని , సినిమాల్లో చిరు పేరు చెప్పుకునే కదా వచ్చిందని అలాగే చిరంజీవి కుటుంబం నుండి దాదాపు పది మంది హీరోలు ఉన్నారు వాళ్ళంతా వారసత్వం కాదా అంటూ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు . వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని చెప్పడమే కాకుండా ప్రభాస్ లాంటి అందగాడు పవన్ కళ్యాణ్ కాదని , అసలు పవన్ కళ్యాణ్ అందగాడు కాదని తేల్చేసాడు మంత్రి జవహర్ . ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ ని ఇంతవరకు కేసిఆర్ కూడా అవమానించలేదు .

- Advertisement -

English Title: TDP minister jawahar slams pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All