Homeటాప్ స్టోరీస్రేటు పెంచిన మెహ్రీన్ కౌర్

రేటు పెంచిన మెహ్రీన్ కౌర్

mehreen kaur hykes her remunerationమెహరీన్ కౌర్ తన రేటు ని అమాంతం పెంచేసిందట . నిన్న మొన్నటి వరకు ఒక్కో సినిమాకు 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేదట కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 70 నుండి 80 లక్షలకు పెంచిందట . మెహరీన్ కౌర్ కు కాస్త డిమాండ్ ఉండటంతో ఆమెని హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆశించే వాళ్ళు చేసేదిలేక ఆ మొత్తానికి ఒకే చెబుతున్నారట . ఒకేసారి 20 లక్షలకు పైగా రెమ్యునరేషన్ పెంచడంతో కొంతమంది నిర్మాతలు షాక్ అవుతున్నారట ! అయితే డిమాండ్ అండ్ సప్లై కాబట్టి మెహరీన్ కౌర్ ని కావాలని అనుకున్న వాళ్ళు ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు .

తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించడానికి 70 లక్షలు డిమాండ్ చేయడంతో తప్పక ఒప్పుకొని ఆ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్దమయ్యారట . 22 ఏళ్ల ఈ భామ కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది . ఆ తర్వాత మహానుభావుడు , రాజా ది గ్రేట్ , కేరాఫ్ సూర్య , జవాన్ చిత్రాల్లో నటించింది . ఇక ఇప్పుడేమో గోపీచంద్ సరసన పంతం చిత్రంలో నటించింది . ఈ చిత్రం ఈనెల 5న విడుదలకు సిద్ధమైంది . చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంది దాంతో తన రేటు ని పెంచేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All