Homeటాప్ స్టోరీస్నితిన్ హీరోయిన్ `డియ‌ర్ మేఘ` ఫ‌స్ట్ లుక్‌!

నితిన్ హీరోయిన్ `డియ‌ర్ మేఘ` ఫ‌స్ట్ లుక్‌!

నితిన్ హీరోయిన్ `డియ‌ర్ మేఘ` ఫ‌స్ట్ లుక్‌!
నితిన్ హీరోయిన్ `డియ‌ర్ మేఘ` ఫ‌స్ట్ లుక్‌!

నితిన్ హీరోగా న‌టించిన `లై` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది త‌మిళ హీరోయిన్ మేఘా ఆకాష్‌. ప్ర‌స్తుతం హీయిన్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం `డియ‌ర్ మేఘ‌`. ఆదిత్ అరుణ్‌, అర్జున్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై అర్జున్ దాస్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏ.. సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. టైటిల్ పాత్రలో మేఘా ఆకాష్ నటించిన ఈ  మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని గురువారం హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఆసక్తికరంగా ఉంది. ఆమె కుడి కన్ను నుండి కన్నీరు చిందించడం కనిపిస్తోంది. ఓ అమ్మాయి క‌థగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర పోస్ట‌ర్ ఉత్సుకతను పెంచేస్తోంది.

- Advertisement -

విభిన్న‌మైన ప్రేమకథగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో అనేక భావోద్వేగాలు ఉంటాయ‌ని తెలుస్తోంది.  ఈ చిత్రం షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా ఆదిత్ అరుణ్ న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌లో అర్జున్ కనిపించనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All