Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ ట్విట్ట‌ర్ ఎంట్రీ.. క్ష‌ణాల్లో రికార్డు ఫాలోవ‌ర్స్‌!

మెగాస్టార్ ట్విట్ట‌ర్ ఎంట్రీ.. క్ష‌ణాల్లో రికార్డు ఫాలోవ‌ర్స్‌!

మెగాస్టార్ ట్విట్ట‌ర్ ఎంట్రీ.. క్ష‌ణాల్లో రికార్డు ఫాలోవ‌ర్స్‌!
మెగాస్టార్ ట్విట్ట‌ర్ ఎంట్రీ.. క్ష‌ణాల్లో రికార్డు ఫాలోవ‌ర్స్‌!

తెలుగు సినిమాకి త‌న‌దైన స్టైల్‌ని, త‌న‌దైన మార్కు డ్యాన్స్‌ని, త‌న స్టైల్ ఆఫ్ ఫైట్స్‌ని అందించి స‌రికొత్త అధ్యాయానికి తెర తీసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్ప‌టి వ‌ర‌కు సుప్రీమ్ హీరోగా జేజేలందుకున్న ఆయ‌న ఆ త‌రువాత త‌న‌దైన మెస్మ‌రిజ‌మ్‌తో మెగాస్టార్ అయ్యారు. ఎల్ల‌లు ఎర‌గ‌ని అభిమాన గ‌ణం ఆయ‌న సొంతం. అలాంటి చిరు త‌న స‌మ‌కాలీన హీరోలు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్నా గ‌త కొంత కాలంగా దూరంగా వుంటున్నారాయ‌న‌.

తాజాగా సోష‌ల్ మీడియాలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నానంటూ ముందే హింట్ ఇచ్చిన చిరు ఉగాది రోజున మొత్తానికి ట్విట్ట‌ర్ ఎంట్రీ ఇచ్చారు. Chiranjeevi Konidela @KChiruTweets ట్విట్ట‌ర్ ఐడీతో ఎంట్రీ ఇచ్చారు. `అంద‌రికి శార్వారి నామ ఉగాది శుభాకాంక్ష‌లు. నా తోటి భార‌తీయులంద‌రితో, తెలుగు ప్ర‌జ‌ల‌తో, నాకు అత్యంత ప్ర‌య‌మైన అభిమానుల‌తో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడ‌గ‌ల‌గ‌డం ఆనందంగా వుంది. ఈ సంవ‌త్స‌రాది రోజు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా మ‌హమ్మారిని క‌లిసిర‌ట్టుగా జ‌యించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుందాం. ఇంటి ప‌ట్టునే వుందాం. సుర‌క్షితంగా వుందాం` అని తొలి  ట్వీట్ చేశారు చిరు.

- Advertisement -

మెగాస్టార్ ట్విట్ట‌ర్‌లోకి ఎంట‌రైన క్ష‌ణాల్లోనే 12 వేల మంది ఫాలోవ‌ర్స్ చేరిపోయారు. ఇప్పుడు దాని సంక్ష 49.5 కెకి చేరింది. ఇంకా ఆ సంక్ష మారుతూనే వుంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All