Homeటాప్ స్టోరీస్బ్యాంకాక్ ని మిస్ అవుతున్నావా..? – పూరీ కి చిరు పంచ్

బ్యాంకాక్ ని మిస్ అవుతున్నావా..? – పూరీ కి చిరు పంచ్

బ్యాంకాక్ ని మిస్ అవుతున్నావా..? – పూరీ కి చిరు పంచ్
బ్యాంకాక్ ని మిస్ అవుతున్నావా..? – పూరీ కి చిరు పంచ్

మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరికీ గుర్తొచ్చేది.. ఆయన నటన,డాన్స్, ఫైట్స్, స్టైల్ మరియు గ్రేస్. ఇవన్నీ కాకుండా చిరంజీవి గారిలో అందరికీ నచ్చేది ఆయన టైమింగ్. కామెడీగా సెటైర్, పంచ్ ఏదైనా వెయ్యాలంటే చిరు సార్ టైమింగ్ ఎవ్వరికీ సాధ్యం కాదు. తెలుగులో చెప్పాలంటే…  సున్నితమైన హాస్యం, సృజనాత్మకత సమయస్పూర్తి అన్నిటికీ మించి కొంచెం చిలిపితనం ఇవన్నీ చిరు సొంతం.

రీసెంట్ గా సోషల్ మీడియాలో కి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్నారు. ఇప్పటికే తనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్న ఇతర నటీనటులకు తనదైన స్టైల్ లో ధన్యవాదాలు చెబుతున్న మెగాస్టార్ తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన శుభాకాంక్షలకు తనదైన చిలిపిదనం తో కూడిన పంచ్ వేశారు. చిరంజీవి గారిని ఉద్దేశించి పూరి జగన్నాథ్ “సార్…  వెల్కమ్ టు సోషల్ మీడియా..! ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ వల్ల…  ఈ సోషల్ మీడియా మిమ్మల్ని మాకు అందరికీ దగ్గరగా ఉంచుతుంది.” అని ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ తనదైన స్టయిల్ లో..

- Advertisement -

 “ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితి వల్ల నేను నా కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడుపుతున్నాను. నువ్వు కూడా ముంబై మరియు బ్యాంకాక్ లో ఉన్న బీచ్ లను మిస్ అవుతూ ఉండి ఉంటావ్. కానీ మీ పిల్లలు పవిత్ర మరియు ఆకాశ్.. నువ్వు ఇంట్లో ఇంత ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం వల్ల ఆనందంగా ఉంటారు.”  అని  పూరి సార్ కి తనదైన శైలిలో చిలిపిగా సెటైర్లు వేశారు.

ఈ తతంగాన్ని వీక్షిస్తున్న నెటిజన్లు మరియు సాటి సెలబ్రిటీలు.. “ఎంతైనా బాస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనకు సంబంధించి కూడా ఇలాంటి విషయాలను లీక్ చేస్తాడు.” అని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ పోస్ట్లు పెట్టే వాళ్ళు అయితే తమకు స్టఫ్ ఇస్తున్నందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All