
మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా గుండు లుక్‌తో కనిపించి కోట్లాది ఫ్యాన్స్ కి షాకిచ్చారు. గత వారం బ్లాక్ గాగుల్స్ ధరించి గుండు లుక్‌తో వున్న ఫొటోని చిరు ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. దానికి అర్బన్ మంక్ అనే క్యాప్షన్‌ని ఇవ్వడంతో అంతా ఇది నజమనే నమ్మారు. బయటికి వచ్చిన చిరు స్టిల్ ఒక్కసారిగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఉన్న పలంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది.
మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి ఎందికిలాంటి స్టెప్ తీసుకున్నారా అని అంతా ఆరాతీయడం మొదలుపెట్టారు. కొంత మందేమో చిరు నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య` షూటింగ్ ప్రశ్నార్థకంలో పడిపోయిందంటూ వరుస కథనాలు ప్రచారం చేశారు. ఇంకొంత మంది మాత్రం యాప్ కారణంగానే చిరు బాల్డ్ హెడ్ లుక్‌లో కనిపించారని కూడా వార్తలు షికారు చేశారు. అయితే చిరు గుండు లుక్ వెనకాల రహస్యం వుందని తేలిపోయింది.
కొన్ని రోజుల క్రితం లుక్ టెస్ట్ కోసం చిరుపై ఈ ప్రయోగం చేశారు. మేకప్‌తో హెయిర్స్‌ని కవర్ చేసి మేకప్‌తో మ్యాజిక్ చేశారు. దీంతో చిరు నిజంగానే గుండు చేయించుకున్నారేంటీ అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఆ అనుమానాలకి చెక్ పెడుతూ తాజా ఇన్ స్టా వేదికగా `మెగాస్టార్ మేకింగ్ ఆఫ్ అర్బన్ మంక్` పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. `ఆచార్య`లో నటిస్తున్న చిరు త్వరలో `వేదాలం` రీమేక్‌లో నటించబోతున్నారు. దీని కోసమే మేకప్ టెస్ట్‌లో చిరు పాల్గొన్నారట.
View this post on Instagram