Homeగాసిప్స్మెగా హీరో సినిమాలో మరోసారి అవకాశం పట్టేసిన భామ

మెగా హీరో సినిమాలో మరోసారి అవకాశం పట్టేసిన భామ

మెగా హీరో సినిమాలో మరోసారి అవకాశం పట్టేసిన భామ
మెగా హీరో సినిమాలో మరోసారి అవకాశం పట్టేసిన భామ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ప్లాపుల నుండి బయటపడి గతేడాది రెండు సూపర్ హిట్స్ తో తిరిగి ఫామ్ అందుకున్న సంగతి తెల్సిందే. 2019లో చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాలతో తేజ్ తిరిగి తన సత్తా చాటాడు, మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తన కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ అయింది ఈ సినిమా.

దీని తర్వాత తేజ్ కొత్త దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. షూటింగ్ మొదలుపెట్టిన రోజే మే 1న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపాడు తేజ్. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. యూత్ కు కనెక్ట్ అయ్యే పాయింట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తేజ్ సరసన ఇస్మార్ట్ భామ నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీత దర్శకుడు. ఇటీవలే ప్రేమికుల రోజున సింగిల్ గా ఉండడమే నినాదం అని చెప్పే ఒక చిన్న వీడియోతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే.

- Advertisement -

ఈ చిత్రం తర్వాత తేజ్ కమర్షియల్ రూట్ ను వదిలి దేవాకట్టాతో సినిమాకు శ్రీకారం చుట్టనున్నాడు. దేవాకట్టా మంచి దర్శకుడే అయినా ఇప్పటిదాకా సరైన కమర్షియల్ విజయం లేదు. ఈ నేపథ్యంలో తేజ్ ఆయనతో సినిమా చేయడం విశేషమే. ఒక సీరియస్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం దేవాకట్టా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తలమునకలై ఉన్నాడు.

తేజ్ కు హీరోయిన్ గా నివేతా పేతురాజ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె తేజ్ తో చిత్రలహరిలో నటించింది. అయితే ఈసారి సోలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All