Homeటాప్ స్టోరీస్మెగా డాట‌ర్ నిర్మాత‌గా మారుతోంది!

మెగా డాట‌ర్ నిర్మాత‌గా మారుతోంది!

మెగా డాట‌ర్ నిర్మాత‌గా మారుతోంది!
మెగా డాట‌ర్ నిర్మాత‌గా మారుతోంది!

మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాణ రంగంలోకి మ‌రొక‌రు అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లుగా మారారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మెగాస్టార్ చిరంజీవితో `ఖైదీ నం 150`, సైరా న‌ర‌సింహారెడ్డి,  ప్ర‌స్తుతం `ఆచార్య‌` చిత్రాలు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మెగా డాట‌ర్ సుస్మిత నిర్మాత‌గా మారుతోంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఖైదీ నం 150`, సైరా న‌ర‌సింహారెడ్డి,  ప్ర‌స్తుతం `ఆచార్య‌` చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌త కొంత కాలంగా సొంత నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్న సుస్మిత నిర్మాణ సంస్థ‌కు `గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌` పేరుని ఖ‌రారు చేశారు. సినిమాల నిర్మాణం చేప‌ట్టాల‌నుకుంటున్న సుస్మిత తొలి ప్ర‌య‌త్నంగా వెబ్ సిరీస్‌ని ప్రారంభిస్తోంది.

- Advertisement -

దీనికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల టైమ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని సుస్మిత ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మార్పులు చోటు చేసుకున్న త‌రువాత మెగా హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు నిర్మించాల‌ని సుస్మిత ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All